భారతదేశం, ఏప్రిల్ 6 -- అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం- నంబూరు రైల్వేలైన్‌ నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అధికారులు భూసేకరణపై ఫోకస్ పెట్టారు. కొంత వరకు భూసేకరణ కొలిక్కి రాగా.. పనులను ప్రారంభించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. మొదటి 27 కిలోమీటర్ల వరకు ట్రాక్‌తోపాటు కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

1.కాజీపేట- విజయవాడ లైన్‌లోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్ మొదలు కానుంది. ఇది రాజధాని అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వద్ద విజయవాడ- గుంటూరు లైన్‌లో కలవనుంది. మొత్తం 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్‌ నిర్మించనున్నారు.

2.ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు భూసేకరణ త్వరలోనే పూర్తి కానుంది. తొలుత ఎర్రుపాలెం- అమరావతి మధ్య 27 కిలోమీటర్ల రైల్వే లైన్, కృష్ణా నదిపై 3.2 కిలోమ...