భారతదేశం, జనవరి 31 -- చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. అమరావతి పనులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ స్టార్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, కేంద్రం సహకారంతో పలు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటి సంగతి అటుంచితే.. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనంత త్వరగా దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.అమరావతి ఔటర్‌ రింగ్ రోడ్డు నిర్మాణానికి తాజాగా మార్గం సుగమమైంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు చెందిన అలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఓఆర్‌ఆర్‌కు ఆమోదం తెలిపింది.

2.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అప్రూవల్‌ కమిటీ నాలుగు చోట్ల స్వల్ప మార్పులను సూచించింది. దాని ప్రకారం మార్పులు చేసి.. రాష్ట్ర ప్రభుత్వ...