భారతదేశం, ఫిబ్రవరి 23 -- అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్‌ఆర్‌కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన 8 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి 189.9 కిలోమీటర్లకు ఇటీవల ఎలైన్‌మెంట్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్‌ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్‌ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది.

2.హైదరాబాద్‌లో గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్‌ఆర్‌కి అనుసంధానం ఉన్నట్లే.. చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్‌ మొదలయ్యే కాజా న...