భారతదేశం, మార్చి 10 -- Amaravati Land Allotment : రాజధాని అమరావతి భూకేటాయింపులపై గత విధానమే కొనసాగిస్తామని మంత్రులు కమిటీ స్పష్టం చేసింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్ సోమవారం భేటీ అయ్యారు. అమరావతిలో సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో మంత్రుల కమిటీ చర్చించింది. ఈ సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో 131 మందికి భూములు కేటాయించామని, వాటిలో 31 సంస్థలకు కేటాయింపులను కొనసాగుతాయన్నారు. 2 కంపెనీలకు గతంలో కేటాయించిన విధంగా కాకుండా వేరే చోట స్థలం కేటాయించినట్లు చెప్పారు. 16 సంస్థలకు స్థలంతో పాటు పరిధిని మార్చామని మంత్రి తెలిపారు.

"ఏపీ రాజధాని అమరావతే అని ఎన్నికలకు ముందు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చెప్పింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతిపై దృష్టి పెట్టాం. 2014...