భారతదేశం, మార్చి 16 -- Amaravati Hudco Funds : ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో), సీఆర్డీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్‌ కుల్‌ శ్రేష్ఠ, మునిసిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు అమరావతి నిర్మాణాలకు హడ్కో రూ.11,000 కోట్లు రుణం అందించనుంది.

జనవరి 22న ముంబయిలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో అమరావతి రాజధానికి నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు నేడు సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏతో హడ్కో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం పూర్తయిన నేపథ్యంలో త్వరలో రాజధాని నిర్మాణ పనులకు నిధులు విడుదల కానున్నాయి. ఈ ఒప్పందం కోసం హడ్కో సీఎండీ సంజయ్‌ కుల్‌ శ్రేష్ఠ శనివారం విజయవాడ చేరుకున్నారు. ఆయనకు మంత్రి నారాయణ, ఎంపీ బాలశౌరి ఘనస్వాగతం ...