భారతదేశం, ఏప్రిల్ 7 -- Amaravati Funds : ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రూ.4285 కోట్ల నిధులు విడుదల చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు 25 శాతం విడుదల చేసింది. ఈ నిధులకు కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4285 కోట్లు ఇచ్చింది. అమరావతిలో పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 25 శాతం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని సీఆర్డీఏ కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా నిధులను విడుదల చేసింది.

ప్రధాని మోదీ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ ఏప్రిల్ మూడో వారంలో ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి లక్షల్లో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉ...