భారతదేశం, మార్చి 6 -- Amaravati Funding: అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్న భూములలో కొంత మేర అమ్మడం ద్వారా రాజధానిని నిర్మిస్తామని మంత్రి నారాయణ వివరించారు. మరోవైపు అమరావతి రుణాల మంజూరులో ఎదురవుతోన్న సాంకేతిక సమస్యలను అధిగమించినట్టు సిఆర్‌డిఏ ప్రకటించింది. రాజధాని అప్పులపై ఆర్థిక సంస్థలు సంతృప్తి చెందినట్టు సీఆర్‌డిఏ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరం అమరావతి నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం వేసేది లేదని చెప్పారు. అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారాయణ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.

అమరావతి రాజధాని నిర్మాణానికి హడ్కో, ప్రపంచ బ్యాంకు, AIIB తో పాటు జర్మనీ బ్యాంకు నుంచి రుణాలు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాజధానిపై ప్రతిపక్షాల మాటలు వినవద్దని, నమ్మవద్దని ప్రజలకు సూచించారు...