భారతదేశం, ఫిబ్రవరి 15 -- రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్‌ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పురపాలక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. నామినేషన్ల ప్రాతిపదికన వీరిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, సీఎంవో నామినేట్‌ చేసిన వారిని బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

నామినేషన్లను పరిశీలించి అర్హత, స్థాయి ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్లను సీఆర్‌డీఏ ఎంపిక చేయనుంది. ప్రస్తుతం ఏడాది కాలానికి వీరిని నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నియమితులైన వారి పనితీరు ఆధారంగా మరింతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సాంకేతికత, సమాజ సేవ, సామాజిక బాధ్యత, అభివృద్ధి వంటి రంగాల్లో ప్రపంచ వ్...