భారతదేశం, ఫిబ్రవరి 6 -- రాజధాని అమరావతి నిర్మాణ పనులకు కేంద్ర ఎన్నికల సంఘం క్లియరెన్స్ ఇచ్చింది. రాజధాని పనులకు టెండర్లు పిలిచేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. కానీ.. ఎన్నికలు పూర్తయ్యాకే టెండర్లు ఫైనలైజ్ చేయాలని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కోడ్‌ నుంచి రాజధాని టెండర్ల ప్రక్రియకు.. మినహాయింపు ఇవ్వాలని ఈసీకి సీఆర్‌డీఏ కమిషనర్‌ లేఖ రాశారు. దీనిపై ఈసీ సానుకూలంగా స్పందించింది.

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పనులకు సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ గత నెలలో పెద్ద ఎత్తున బిడ్లు ఆహ్వానించాయి. వీటిలో చాలా పనులకు గడువు ముగిసింది. మరికొన్నింటిని 7వ తేదీన తెరవాల్సి ఉంది. బిడ్లను తెరిచి ఖరారు చేసే దశలో.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. షెడ్యూల్ వెలువడింది. దీంతో టెండర్ల ఖరారు, కొత్తవి పిలిచే ప్రక్రియకు బ్రేక్ పడింది.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలోనే కాంట్రాక్టర్లను ఖరా...