భారతదేశం, ఏప్రిల్ 6 -- ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి రైతులు పట్టువస్త్రాలను కానుకగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తమ గ్రామ పరిధిలో ఇల్లు నిర్మించుకుంటున్నందుకు పట్టు వస్త్రాలు పెడుతున్నట్టు రైతులు చెబుతున్నారు. ఇటీవల వెలగపూడి రెవెన్యూ పరిధిలో కొనుగోలు చేసిన స్థలంలో చంద్రబాబు కుటుంబం ఇల్లు నిర్మించుకుంటోంది.

నూతన ఇంటి నిర్మాణానికి ఈనెల 9వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటలకు ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. స్థలం రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం నాలుగు రోజుల కిందటే పూర్తి అయింది. ప్లాట్‌లో నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులను కాంట్రాక్టర్ ప్రారంభించారు. గతంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించడం.. తాజాగా ఇంటిని తమ పరిధిలోనే కట్టుకుంటుండడంతో వెలగపూడి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తమ గ్రామానికి గు...