భారతదేశం, మార్చి 25 -- కలెక్టర్ అంటే దర్బారు, దర్పము కాదు.. ప్రజల్లో మనిషి అయి.. ప్రగతి మనసుతో ఆలోచించి.. తన పదవీకాలంలో ఆ జిల్లాపై చెరగని ముద్ర వేయాలి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో ఒకటో రెండో కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లు జరిగాయన్నారు. అది కూడా ప్రజావేదిక కూల్చటం లాంటి కక్షసాధింపు చర్యలకు ఉపయోగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

'దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పింఛన్లు రెట్టింపు చేసి అన్ని వర్గాలకు అందిస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే మూడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లు పెట్టి, ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, ప్రజల కోసం తపిస్తూ అందరం పని చేస్తున్నాం. ఏప్రిల్ తొలివారంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం. ఉపాధ్యాయ ఉద్యోగాలు 80 శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం. పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామ...