భారతదేశం, మార్చి 7 -- ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరిచారు మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు నాగబాబు. ఈ నామినేషన్ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు.. జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. నాగబాబు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని పవన్ కళ్యాణ్‌.. నాగబాబుకు ఈమధ్యే సమాచారం ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేయడానికి అవసరమై...