భారతదేశం, ఏప్రిల్ 13 -- రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రాజధాని అమరావతి పనులు పునః ప్రారంభం అయ్యాయి. కీలక పనులకు టెండర్లను పిలవడానికి సీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అటు కేంద్రం సహకారం, ఇటు బ్యాంకుల రుణాలు, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమరావతి విస్తరణకు మరో 30 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన 9 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.అమరావతి విస్తరణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా 30 వేల ఎకరాలను సేకరించాలని యోచిస్తోంది. ఇది అంతర్జాతీయ విమానాశ్రయం, రింగ్ రోడ్లు వంటి భవిష్యత్ ప్రాజెక్టులకు తోడ్పడుతుంది. రాజధాని చుట్టూ భూ సేకరణపై సీఆర్డీఏ కసరత్తు చేస్తోంది.

2.అమరావతి కోర్ క్యాపిటల్ ...