భారతదేశం, ఫిబ్రవరి 3 -- Amaravati Railway Line : రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ఏపీలోని రైల్వేల అభివృద్ధికి రూ.9,417 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. విజ‌య‌వాడ రైల్వే డివిజ‌న్‌లో అమృత్ భారత్ స్టేషన్ల కింద 20 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నట్లు విజయవాడ డివిజినల్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి రూ.271.43 కోట్లు మంజూరైన‌ట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో జ‌న‌వ‌రి నాటికి విజ‌య‌వాడ రైల్వే డివిజన్ రూ.4,864.57 కోట్ల స్థూల ఆదాయాన్ని సాధించింద‌ని, విజ‌య‌వాడ రైల్వే స్టేషన్ రూ. 500 కోట్లకు పైగా ఆదాయాన్ని పొంది ఎన్ఎస్‌జీ-1 హోదాను సాధించింద‌ని డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. ఎర్రుపాలెం - నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త ర...