భారతదేశం, ఫిబ్రవరి 18 -- ప్రతీ ఏటా ఫాల్గుణమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి అని అంటారు. ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి రోజు విష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలాగే ఉపవాసం ఉంటారు. ఇలా ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని నమ్మకం. సకల పాపాలు తొలగిపోయి విముక్తి కలుగుతుందని, జీవితంలో ఆనందం ఉంటుందని కూడా చెబుతారు.

అమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి 2026 చాలా ప్రత్యేకమైనది. ఈరోజు విష్ణువు, శివుడు, పార్వతిని ఆరాధిస్తారు. మరి ఈ ఏడాది అమలకి ఏకాదశి లేదా రంగభరి ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు పూజా విధానం, శుభముహూర్తం, పాటించాల్సిన విధానాల గురించి తెలుసుకుందాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ శుక్ల ఏకాదశి ఫిబ్రవరి 27 రాత్రి 12:33కి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 27 రాత్రి 10:22కి ముగుస్తుంది...