Hyderabad, మార్చి 18 -- ఆరోగ్యంగా ఉండాలంటే అధిక ప్రొటీన్లు కలిగిన ఆహారాలను తినాలి. శరీరానికి ప్రొటీన్లు సరిగ్గా అందితేనే కండరాల పనితీరు బాగుంటుంది. కడుపు నిండా తిన్న తృప్తితో పాటు శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ప్రతి రోజూ తగినంత ప్రోటీన్ తీసుకోవడం కండరాల సమస్యల నివారించడానికి, ఆకలిని అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకనే వారు, ఫిట్‌నెస్ కోసం డైట్ పాటించే వారు ఉపవాసాలు వంటివి చేస్తున్న వారు ఆహారాన్ని సమతుల్యగా తీసుకునేందుకు ప్రొటీన్లు చాలా బాగా సహాయపడతాయి.

ప్రొటీన్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేవి గుడ్లు, చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారమే. ఇవి ఆరోగ్యానికి మంచివే కానీ రోజూ ఇలా మాంసాహారం తినడం చాలా మందికి బోరింగ్‌గా అనిపించచ్చు. వారి వారి ఆచారాలు, వ్యవహారాలు, రుచుల రీత్యా ప్రతిరోజూ నాన్ వెజ్ తినడం కొందరకి ఇబ్బంద...