భారతదేశం, ఫిబ్రవరి 15 -- అల్లూరి సీతారామ‌రాజు జిల్లా గొలుగొండ మండలంలో జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. ఇక్కడ పనిచేసే పీఈటీ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన గురించి స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం.. ఈ నెల 1న త‌మిళ‌నాడులో జాతీయ‌ క్రీడ‌లు జరిగాయి. ఆ పోటీలకు జట్పీ హైస్కూల్ నుంచి సుమారు 10 మంది విద్యార్థినులు వెళ్లారు. వారిని ఆ స్కూల్ పీఈటీ కుందూరి నూక‌రాజు తీసుకువెళ్లారు.

విద్యార్థినులు వెళ్తున్న‌ప్పుడు వారికి ర‌క్ష‌ణగా మ‌హిళ ఉపాధ్యాయురాలిని కూడా పంపాలి. కానీ ప్ర‌ధానోపాధ్యాయుడు మ‌హిళ ఉపాధ్యాయురాలిని పంప‌లేదు. ఇదే అదునుగా పీఈటీ నూక‌రాజు రెచ్చిపోయాడు. విద్యార్థినుల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించేవాడు. ఎవ‌రికి చెప్పుకోవాలో అర్థం కాక వారు భరించారు. తిరిగి ఇంటికి వ‌చ్చిన త‌రువాత త‌మ ప‌ట్ల పీఈటీ వ్య‌వ‌హ‌రించిన తీరును త‌ల్లిదండ్రుల‌క...