భారతదేశం, మార్చి 17 -- పుష్ఫ 2తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు. రికార్డుల దుమ్ము దులిపారు. రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. ఇంతటి విజయవంతమైన మూవీకి కొనసాగింపుగా వచ్చే పుష్ఫ 3 ఎప్పుడు మొదలవుతుందనే ఇంట్రెస్ట్ నెలకొంది. దీనిపై అల్లు అర్జున్ కానీ డైరెక్టర్ సుకుమార్ కానీ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. కానీ తాజాగా నిర్మాత రవి శంకర్ పుష్ఫ 3పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

పుష్ప ఫ్రాంఛైజీలో తొలి రెండు మూవీస్ లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ అదరగొట్టాడు. మాస్ యాక్టింగ్ తో వసూళ్ల వర్షం కురిపించాడు. ఈ ఫ్రాంఛైజీలో రాబోతున్న పుష్ఫ 3 పై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమా రెండేళ్ల తర్వాతే స్టార్ట్ అవుతుందని రవి శంకర్ వెల్లడించారు. ఇప్పుడు హీరో అల్లు అర్జున్, డైరె...