Hyderabad, ఫిబ్రవరి 23 -- Allu Arjun Reaction On Wearing Saree In Pushpa 2 The Rule: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప 2 ది రూల్ థియేటర్లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా పుష్ప 2 ట్రెండ్ అవుతోంది.

పుష్ప 2 ది రూల్ మూవీలో గంగమ్మ జాతర సీన్‌కు మంచి పేరు వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ చీర, మేకప్, ఆభరణాలు ధరించి నాట్యం చేశారు. అయితే, ఈ గంగమ్మ జాతర సీన్, ఇందులో చీర కట్టుకోవాలని డైరెక్టర్ సుకుమార్ చెప్పినప్పుడు తన రియాక్షన్ ఏంటీ, ఏమనిపించిందో తాజాగా హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

"జాతర సన్నివేశం గురించి ఒక ముక్కలో చెప్పాలంటే.. దర్శకుడు సుకుమార్ మొదట నాతో చీర కట్టుకోవాలని చెప్పినప్పుడు నేను భయపడ్డాను. అవును, అదే నా ఫస్ట్ రియాక్షన్. ...