భారతదేశం, ఫిబ్రవరి 8 -- హీరోలు, కెమెరామెన్లు, కొరియోగ్రాఫ‌ర్లు సినిమా కోసం ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి హిట్టు ఇచ్చేది డైరెక్ట‌ర్ ఒక్క‌డేన‌ని అల్లు అర్జున్ అన్నాడు. పుష్ప 2 స‌క్సెస్ క్రెడిట్ సుకుమార్‌దేన‌ని అల్లు అర్జున్ చెప్పాడు. అతడు హీరోగా న‌టించిన పుష్ప 2 థాంక్స్ మీట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో పుష్ప 2 స‌క్సెస్‌పై అల్లు అర్జున్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ప‌లుమార్లు ఎమోష‌న‌ల్ అయ్యాడు. ఈ థాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.

ఈ సినిమాలో నా యాక్టింగ్‌పై చాలా కాంప్లిమెంట్స్ వ‌చ్చాయి.ఆ ప్ర‌శంస‌ల‌న్నీ సుకుమార్ వ‌ల్లే ద‌క్కాయి సుకుమార్‌కు థాంక్స్ చెప్ప‌డం త‌క్కువే అవుతుంది. ఈ సినిమా కోసం ప‌నిచేసిన వేల మంది థాంక్స్ చెప్పాల్సింది ఒక్క సుకుమార్‌కే అని బ‌న్నీ అన్నాడు.

సినిమాలో పాట , ఫైట్‌, సీన్ ...