Hyderabad, ఫిబ్రవరి 10 -- Allu Aravind on Ram Charan: అల్లు అరవింద్ తనపై మెగా అభిమానులు చేస్తున్న ట్రోలింగ్ పై స్పందించాడు. తండేల్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత దిల్ రాజును స్టేజ్ పైకి పిలవడానికి అతడు రామ్ చరణ్ ను అవమానించాడంటూ మెగా ఫ్యాన్స్ హర్ట్ అయిన వేళ తన ఉద్దేశం అది కాదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే తాను ఆ మాట అనాల్సింది కాదని అతడు అనడం గమనార్హం.

అల్లు అరవింద్ సోమవారం (ఫిబ్రవరి 10) మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు. రామ్ చరణ్ ను తాను తక్కువ చేయలేదని, అతని తనకు కొడుకు లాంటి వాడని అన్నాడు. "ఈ మధ్య దిల్ రాజును నా స్టేజ్ పైకి ఆహ్వానించే సమయంలో నేను రామ్ చరణ్ ను తక్కువ చేశానని మెగాభిమానులు నన్ను ట్రోల్ చేశారు.

దీనిపై ఓ సీనియర్ జర్నలిస్ట్ అడిగితే ఆ సందర్భం అది కాదు మళ్లీ చెబుతానని అన్నాను. నే...