భారతదేశం, ఏప్రిల్ 10 -- Allahabad HC: మహిళ వక్షోజాలను పట్టుకోవడం లేదా పైజామాను కిందకు లాగడం అత్యాచారం లేదా అత్యాచారయత్నం గా భావించలేమని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించిన కొన్ని వారాల తరువాత.. అదే కోర్టులోని మరో న్యాయమూర్తి అత్యాచార నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. అత్యాచారానికి బాధ్యత ఆ బాధిత యువతిదేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఒక యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న ఆ యువతి తన ముగ్గురు మహిళా స్నేహితులతో కలిసి ఢిల్లీలోని ఓ బార్ కు వెళ్లింది. అక్కడ వారు అతిగా మద్యం సేవించారు. తెల్లవారు జామున 3 గంటల వరకు వారు అక్కడే ఉన్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడంతో ఆమె పూర్తిగా మత్తులోకి జారుకుని, ఒంటరిగా తిరిగి వెళ్లలేని పరిస్థితికి చేరుకుంది. అదే సమయంలో, ఆమె బార్ లో ఉండగా నిందితుడు ఆమెను తనతో పాటు తన ఇంటి...