Hyderabad, మార్చి 26 -- భారతీయ వంటలకు ప్రత్యేకమైన రుచినీ, వాసనను, రంగును అందించేవి వాటిలో వేసే మసాలాలే. రోజూ తినే సింపుల్ వంటల్లో కూడా నాలుగు నుంచి ఐదు రకాల మసాలాలు వేస్తూ ఉంటారు. అవి వంటకు ప్రత్యేకమైన రుచి, రంగును అందిస్తాయి. వంట రుచిని రెట్టింపు చేస్తాయి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. మసాలాలను వాడటం సరిగ్గా తెలుసుకున్న వారు ఇంట్లోనే రెస్టారెంట్ లాంటి రుచికరమైన వంటను తయారు చేయగలరు. మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని అనిపించుకోగలుగుతారు. ఇలా మీకు కూడా అనిపించుకోవాలి అనుకుంటే ఈ ఆల్ ఇన్ వన్ మసాలా రెసిపీ మీ కోసమే.

ఈ సీక్రెట్ మసాలాను వంటల్లో వేయడం ప్రారంభించారంటే మీ వంట రుచి చూసిన వారంతా మీరు బెస్ట్ షెఫ్ అంటారు. పప్పు నుంచి పలావ్ వరకూ, టిఫిన్ల నుంచి కూరల వరకూ అన్నింటిలో దీన్ని వేసుకోవచ్చు. నమ్మకం లేదా? ఒకసారి ట్రై చేసి చూడండి....