భారతదేశం, మార్చి 14 -- ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో భారత యువ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్ లోకి దూసుకెళ్లాడు. డిఫెండింగ్ ఛాంపియన్ కు ఈ కుర్రాడు షాకిచ్చాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్యసేన్ 21-13, 21-10 తేడాతో జొనాథన్ క్రిస్టీపై విజయం సాధించాడు. వరుస గేమ్ ల్లో లక్ష్యసేన్ విజేతగా నిలిచాడు.

తన ట్రేడ్ మార్క్ డిఫెన్సివ్ స్కిల్స్ తో ప్రత్యర్థిని లక్ష్యసేన్ బోల్తా కొట్టించాడు. జొనాథన్ ను ఎర్రర్స్ చేసేలా లక్ష్య ఉసిగొల్పాడు. వరల్డ్ నంబర్ టూ జొనాథన్ కు లక్ష్య ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. ర్యాలీలు, డ్రాప్ షాట్లు, క్రాస్ కోర్ట్ షాట్లలో ఆధిపత్యం ప్రదర్శించాడు.

డిఫెండింగ్ ఛాంపియన్ జొనాథన్ క్రిస్టీపై లక్ష్య సేన్ వరుస గేమ్ ల్లో విజయం సాధించాడు. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించాడు. తొలి గేమ్ లో దూకుడుతో సాగిన లక్ష్య.. 21-13తో...