భారతదేశం, మార్చి 12 -- భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు షాక్. ఎన్నో అంచనాలతో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ బరిలో దిగిన సింధు తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. తక్కువ ర్యాంకు క్రీడాకారిణి చేతిలో పరాజయం పాలైంది. బుధవారం (మార్చి 12) సింధు 21-19, 13-21, 13-21 తేడాతో కిమ్ గా యున్ (కొరియా) చేతిలో ఓటమి పాలైంది.

ప్రపంచ 16వ ర్యాంకర్ పీవీ సింధు ఈ పోరును మెరుగ్గానే మొదలెట్టింది. కండరాల గాయం నుంచి కోలుకుని ఈ టోర్నీలో అడుగుపెట్టిన ఆమె ఫస్ట్ దూకుడు ప్రదర్శించింది. తొలి గేమ్ ను 21-19తో గెలుచుకుంది. కిమ్ పై సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. తనదైన శైలిలో స్మాష్ లతో సత్తాచాటింది. ఈ గేమ్ టఫ్ గానే సాగినా కీలక సమయంలో సింధు అప్పర్ హ్యాండ్ సాధించింది.

తొలి గేమ్ ను గెలిచి మ్యాచ్ ను గొప్పగా మొదలెట్టిన సింధు విజయం సాధించేలా కనిపించింది. క...