Hyderabad, ఫిబ్రవరి 3 -- రణబీర్ కపూర్, వారి ముద్దుల కూతురు రాహాతో కలిసి అలియా భట్ వెకేషన్‌కు వెళ్లింది. తిరిగి వస్తూ ఆమె కుటుంబం ముంబై విమానాశ్రయంలో కనిపించింది. అప్పుడు ఆమె అందమైన కుర్తాలో కనిపించింది. ఆమె కుటుంబం ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అలియా అద్భుతమైన ఎథ్నిక్ లుక్ లో తన ఫ్యాషన్ టాలెంట్ ను ప్రదర్శించింది. ఫ్యామిలీ విహారయాత్రకు వెళితే అలియా సింపుల్ స్టైల్‌తో అందరి కళ్లను తన వైపు తిప్పుకుంటోంది.

అలియా వేసుకున్న కుర్తా తేలికపాటి లినిన్ ఫ్యాబ్రిక్ తో రూపొందించినది. అద్భుతమైన ఐవరీ కుర్తా సెట్ లో అలియా ఎంతో అందంగా ఉంటుంది. ఈ కుర్తాలో వి-నెక్లైన్, రిలాక్స్డ్ ఫిట్, లూజ్ స్లీవ్స్ ఉన్నాయి. ఈ డ్రెస్ స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా ఉంటుంది. కుర్తా, స్లీవ్స్ మీద యూరోపియన్ రోజ్ డిజైన్, దాదాపు ఒక అద్భుతమైన పెయింటింగ్ లాగా ఈ దుస్తులను ...