భారతదేశం, ఏప్రిల్ 5 -- Alekhya Chitti Pickles : అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం... సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. పికిల్స్ రేటు గురించి అడిగినందుకు అలేఖ్య బూతు పంచాగం ఎత్తడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అలేఖ్య పికిల్స్ మూతపడే స్థాయికి చేరుకుంది. అయితే తాజాగా ఈ వివాదానికి కారణమైన అలేఖ్య సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అసభ్యపదజాలంతో దూషించడంపై క్షమాపణలు చెప్పారు. ఇప్పటికైనా ఈ వివాదానిపు ఫుల్ స్టాప్ పడుతుందో? లేదో? వేచిచూడాలి.

గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియోలు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో అలేఖ్య ఆడియోలు హల్ చల్ చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన అలేఖ్య అక్క సుమ, చెల్లెలు రమ్య కంచర్ల పచ్చళ్ల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇటీవల పచ్చళ్ల రేట్లు ఎక్కువగా ...