Hyderabad, మార్చి 7 -- మద్యం తాగే అలవాటు స్త్రీ పురుషులు ఇద్దరికీ హానికరమే. అయితే మద్యం శరీరంలో చేరాక త్వరగా మహిళల ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. స్త్రీల శారీరక నిర్మాణం పురుషులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అందుకే ఇద్దరి పైన మద్యం ప్రభావం కూడా భిన్నంగానే ఉంటుంది. మద్యం సేవించే స్త్రీలకు అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం అధికం.

ఒకప్పుడు పురుషులు మాత్రమే మధ్య అన్ని సేవించేవారు. కానీ ఇప్పుడు మద్యం తాగుతున్న మహిళల సంఖ్య పెరిగిపోతోంది. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మద్యం చాలా తక్కువ సమయంలోనే స్త్రీ శరీరంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల వారికి కోమాలోకి వెళ్లడం, కాలేయం పాడవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మద్యం సేవించే మహిళలు ఎక్కువగా క్యాన్సర్ బారిన లేదా...