భారతదేశం, ఫిబ్రవరి 14 -- Akshara Chitfunds: ప్రైవేటు చిట్ ఫండ్ ల పేరుతో డిపాజిట్లు, చిట్టీల ద్వారా భారీగా డబ్బులు సేకరించి గడువు ముగిసిన సభ్యులకు డబ్బులు చెల్లించక పోవడంతో ఆస్థులు కూడబెట్టుకుని మోసం చేసిన ప్రైవేట్ ఫైనాన్స్ చిట్ ఫండ్ కంపెనీలపై కరీంనగర్ పోలీసులు కొరడా ఝుళిపించారు. కరీంనగర్ రాజీవ్ చౌక్ లో "అక్షర చిట్ ఫండ్స్ ప్రయివేట్ లిమిటెడ్", " అక్షర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్" కు చెందిన ఆస్తులను క్రయవిక్రయాలు చేయకుండా అటాచ్డ్ చేస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ డిపాజిటర్ల రక్షణ చట్టం, 1999 (చట్టం నం. 19 ఆఫ్ 1999) సెక్షన్ 5 కింద, అక్షర టౌన్‌ షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్" ద్వారా సంపాదించిన స్థిరాస్తుల అటాచ్‌మెంట్ చేయాలని గతంలో డీజీపీ సీఐడీ హైదరాబాద్ ద్వారా ప్రభుతాన్ని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభి...