Hyderabad, ఏప్రిల్ 11 -- Akkada Ammayi Ikkada Abbayi Review Review Telugu: బుల్లితెరపై యాంకర్స్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా నటించిన రెండో సినిమానే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.

మొదటి సారి మెయిన్ హీరోయిన్‌గా దీపిక పిల్లి నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు జబర్దస్త్ డైరెక్టర్స్ నితిన్ భరత్ దర్శకత్వం వహించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి సినిమా టైటిల్‌తో వచ్చిన ఈ మూవీ ఇవాళ (ఏప్రిల్ 11) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూలో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజీనిర్‌గా కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) పనిచేస్తుంటాడు. ఆంధ్ర-తమిళనాడు బార్డర...