భారతదేశం, ఫిబ్రవరి 28 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ తెరంగేట్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు ఫస్ట్ మూవీ గురించి ప్రకటన వస్తుందా అని వేచిచూస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‍తో కొంతకాలంగా అకీరా తరచూ కనిపిస్తున్నారు. పవన్ వెన్నంటే ఉంటున్నారు. అకీరా హీరోగా చేసేందుకు పూర్తి రెడీ అయ్యారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే, అకీరా ఫస్ట్ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, తాజాగా కొన్ని రూమర్లు బయటికి వచ్చాయి.

అకీరా నందన్ హీరోగా చేసే తొలి సినిమాను 'వైజయంతీ మూవీస్' బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించనున్నారని తాజాగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రతిష్ట్మాక బ్యానర్‌తో చిత్రంతో అకీరా సినీ ఎంట్రీ ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్‍ను కూడా చిరుత (2007) చిత్రంతో ఇండస్ట్రీకి ప...