భారతదేశం, జనవరి 5 -- రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన గేమ్ ఛేంజ‌ర్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ భారీ బ‌డ్జెట్ మూవీకి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ న‌టుడు ఎస్‌జే సూర్య విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో మోపిదేవి అనే రాజ‌కీయ నాయ‌కుడిగా ఎస్‌జే సూర్య క‌నిపించ‌బోతున్నారు.

గేమ్ ఛేంజ‌ర్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌న పాత్ర‌తో పాటు ఖుషి సీక్వెల్‌పై ఎస్‌జే సూర్య ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

గేమ్ చేంజర్ సెట్‌లో డైరెక్ట‌ర్ శంక‌ర్‌ చెప్పింది చేసుకుంటూ వెళ్లాను. నా పర్ఫామెన్స్ చూసి శంకర్ ఇంప్రెస్ అయ్యారు. గేమ్‌ఛేంజ‌ర్‌లో నా నటనను చూసే నాకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చారు. శంక‌ర్‌ ప్రతీ ఒక్క క్యారెక్ట‌ర్ ఏ సీన్‌కు త‌గ్గ‌ట్లుగా ఎలా చేయాలో నటించి చూపిస్తారు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే ...