భారతదేశం, మార్చి 12 -- Akhil Akkineni: అఖిల్ ఏజెంట్ విడుద‌లై దాదాపు రెండేళ్లు కావ‌స్తోంది. అయినా ఇప్ప‌టివ‌ర‌కు అఖిల్ కొత్త సినిమా మొద‌లుపెట్ట‌లేదు. ఏజెంట్ డిజాస్ట‌ర్ కావ‌డంతో నెక్స్ట్ మూవీపై ఆచితూచి అడుగులు వేస్తోన్నారు. అఖిల్ నెక్స్ట్ మూవీకి విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ ఫేమ్ ముర‌ళీకృష్ణ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎట్ట‌కేల‌కు ఈ మూవీ సెట్స్‌పైకిరానున్న‌ట్లు స‌మాచారం. మార్చి 14 నుంచి హైద‌రాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ మొద‌లుకానున్న‌ట్లు తెలిసింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూరల్ ఫ్యామిలీ డ్రామా మూవీగా అఖిల్ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీతోనే ఫ‌స్ట్ టైమ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను అఖిల్ ట‌చ్ చేయ‌బోతున్నాడు. చిత్తూరు నేప‌థ్యంలో ఈ మూవీ క‌థ సాగుతుంద‌ని అంటున్నారు. ఈ సినిమాలోని కీల‌క‌మైన ఎపిసో...