భారతదేశం, ఏప్రిల్ 19 -- గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్‍లతో జోష్ మీద ఉన్నారు. ఈ ఏడాది డాకు మహరాజ్ చిత్రంతో మరో బ్లాక్‍బస్టర్ సాధించారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు బాలయ్య. 2021లో వీరి కాంబినేషన్‍లో వచ్చిన అఖండ బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. అప్పటికి బాలకృష్ణ కెరీరో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ మూవీకి సీక్వెల్‍గా వస్తున్న అఖండ 2 చిత్రానికి క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ క్రమంలో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం మేకర్స్ భారీ రేటు చెబుతున్నారని సమాచారం. ఆ వివరాలు ఇవే..

అఖండ 2 చిత్రానికి మంచి హైప్ ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ హౌస్‍ను కొన్ని ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లు సంప్రదించాయని తెలుస్తోంది. మేజర్ ఓటీటీ సంస్థలైన నెట్‍ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‍ఫామ్‍లు చర్చలు కూడా ...