Hyderabad, జనవరి 29 -- పురాతన కాలం నుంచి వాముకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో కూడా వాము తినమని సిఫారసు చేస్తారు. ప్రతిరోజూ వాము తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాము తినడం వల్ల మీ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ శరీర జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది మీ శ్వాసకోశ రుగ్మతలను సరిచేస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.

వామును నమలడం వల్ల తాజా శ్వాస అందుతుంది. ఇది మంటను తగ్గిస్తుంది. చిగుళ్ల ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది. పంటినొప్పిని నయం చేస్తుంది. మంచి నోటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది. నోటి ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

వాములో ఉండే థైమోల్ యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇది మీ శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్త...