భారతదేశం, ఫిబ్రవరి 6 -- Pattudala Twitter Review: అజిత్ హీరోగా న‌టించిన ప‌ట్టుద‌ల (త‌మిళంలో విదాముయార్చి) సినిమాకు ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ నుంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. ఈ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ మూవీకి మ‌గీజ్‌ తిరుమేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త్రిష హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించింది. గురువారం తెలుగు, త‌మిళ భాష‌ల్లో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?

స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు మ‌గీజ్ తిరుమేని ఈ మూవీని తెర‌కెక్కించాడు ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. యాక్ష‌న్ రోల్‌లో అజిత్ అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. ఫ‌స్ట్ హాఫ్‌లో అజిత్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ థియేట‌ర్ల‌లో గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తుంద‌ని ఓ నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. అజిత్‌, త్రిష కాంబోలో వ‌చ్చే సీన్స్ బాగుంటాయ‌ట‌.

యాక్ష‌న్ సీక్వెన్స్‌లు అయితే హాలీవుడ్...