Hyderabad, ఏప్రిల్ 7 -- Ajith Cut Out Fall Down Over Good Bad Ugly Release: అభిమానుల చేష్టలు ఇతరుల ప్రాణాల మీదకు తీసుకొచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఫ్యాన్స్ అమితమైన పిచ్చి వల్ల ఇతరులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సంఘటనే మరోసారి జరిగింది.

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ అభిమానుల విషయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. సుమారు 285 అడుగుల భారీ కటౌట్‌ను ఆయన అభిమానులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, అజిత్ కటౌట్‌ను ఏర్పాటు చేసే క్రమంలో అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అజిత్ కటౌట్ నేలపై పడుతుండగా అభిమానులు పరుగులు పెట్టారు.

ఈ సంఘటన తమిళనాడులోని తిరునల్వేలిలో ఉన్న పీఎస్ఎస్ మల్టీప్లెక్స్ వద్ద జరిగింది. అయితే, అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పీఎస్ఎస్ మల్టీప్లెక్స్ వద్ద...