భారతదేశం, అక్టోబర్ 30 -- దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును అధికారులు పొడిగించారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు. నవంబర్ 11వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఎజెన్సి (NTA) నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి గాను ఆరో త‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల్లో ప్ర‌వేశాల‌ు కల్పిస్తారు.

ప్ర‌వేశ ప‌రీక్ష జ‌న‌వ‌రి 18, 2026 తేదీన నిర్వ‌హిస్తారు. అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://exams.nta.nic.in/r ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, స్టూడెంట్ ఫోటో, సంత‌కం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లో ...