భారతదేశం, ఫిబ్రవరి 14 -- సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో కెరీర్‌లోనే పెద్ద హిట్టును త‌న ఖాతాలో వేసుకుంది ఐశ్వ‌ర్య రాజేష్‌. వెంక‌టేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ మూవీ మూడు వంద‌ల కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. రామ్ చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్‌, బాల‌కృష్ణ డాకు మ‌హారాజ్ సినిమాల‌కు పోటీగా సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ మూవీ పండుగ విన్న‌ర్‌గా నిలిచింది.

సంక్రాంతికి వ‌స్తున్నాం కంటే ముందు తెలుగులో కౌస‌ల్య కృష్ణ‌మూర్తి, రిప‌బ్లిక్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేసింది ఐశ్వ‌ర్య రాజేష్. కానీ అవేవి ఆమెకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాయి. తొలి స‌క్సెస్‌ను సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీతోనే అందుకున్న‌ది.

ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో వెంక‌టేష్ భార్య పాత్ర‌లో త‌న కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌తో మెప్పించింది ఐశ్వ‌ర్య రాజేష్‌. ఆమె న‌ట‌నకు ప్ర‌...