భారతదేశం, ఫిబ్రవరి 11 -- Aishwarya Rajesh: సుడ‌ల్ వెబ్‌సిరీస్ సీజ‌న్ 2 రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ త‌మిళ‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో సుడ‌ల్ సీజ‌న్ 2 రిలీజ్ అవుతున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ ప్ర‌క‌టించింది.

ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ డేట్‌తో పాటు కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది. ఈ పోస్ట‌ర్‌లో ఐశ్వ‌ర్య రాజేష్‌తో పాటు కాథిర్ ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తోన్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ జాత‌ర విజువ‌ల్స్, విచిత్ర అలంక‌ర‌ణ‌లో ఉన్న ఓ ముఖం క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

సుడ‌న్ సీజ‌న్‌లో 2లో ఐశ్వ‌ర్య రాజేష్, కాథిర్‌తో పాటు గౌరి జి కిష‌న్‌, మంజిమా మోహ‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ వెబ్‌సిరీస్‌కు పుష్క‌ర్- గాయ‌త్రి క...