Hyderabad, మార్చి 26 -- Aishwarya Rai Car Accident: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ప్రయాణిస్తున్న కారును ముంబైలో బుధవారం (మార్చి 26) ఓ స్థానిక బస్సు ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై కాసేపు గందరగోళం నెలకొంది. అయితే ఆ సమయంలో ఐశ్వర్య ఆ కారులో లేదని బాలీవుడ్ షాదీస్ అనే ఫొటోగ్రాఫర్ పేజీ ఒకటి వెల్లడించింది.

ముంబైలో ఐశ్వర్య రాయ్ కారు ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి ఓ బస్సు వచ్చి ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఉన్న ఐశ్వర్య బాడీగార్డులు కిందికి దిగారు. అయితే ఈ ప్రమాదంలో కారుకు పెద్దగా నష్టమేమీ జరగలేదు. ఈ ప్రమాదంపై బస్సు డ్రైవర్ ను బాడీగార్డులు నిలదీశారు. ఆ తర్వాత కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే పోలీసుల వెర్షన్ మాత్రం వేరుగా ఉంది.

అక్కడ ప్రమాదం ఏమీ జరగలేదని చెబుతున్నారు. కారు వెనుక వస్తున్న బస్సు పదే పదే హారన్ మోగిస్తుండటంతో ఎందుకలా హా...