Hyderabad, ఫిబ్రవరి 5 -- Aishwarya Rai: ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో ఆమె తన భర్త అభిషేక్ 49వ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెప్పింది. అది కూడా అతని చిన్ననాటి ఫొటోతో కావడం విశేషం. బుధవారం (ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చన్ తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు.

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకుంటున్నారని, బచ్చన్ ఫ్యామిలీతో అసలు ఐశ్వర్యకు పడటం లేదని గతేడాది నుంచి ఎన్నో వార్తలు వస్తున్నాయి. గతేడాది నవంబర్ లో ఐశ్వర్య బర్త్ డే సందర్భంగా అభిషేక్ తప్ప బచ్చన్ ఫ్యామిలీలో ఎవరూ ఆమెకు విషెస్ చెప్పలేదు.

అంతేకాదు ఆరాధ్య బర్త్ డేకు కూడా ఆ కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. ఈ నేపథ్యంలో వీళ్ల విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో బుధవారం (ఫిబ్రవరి 5) అభిషేక్ బచ్చ...