భారతదేశం, ఏప్రిల్ 15 -- Airtel Sim Home Delivery : హైదరాబాద్ లోని తన కస్టమర్లకు 10 నిమిషాల్లో సిమ్ కార్డులను డెలివరీ చేసేందుకు క్విక్ కామర్స్ ప్లాట్ ఫామ్ బ్లింకిట్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. ఇప్పుడు దేశంలోని 16 నగరాల్లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, మరిన్ని నగరాలు, పట్టణాలలో అందుబాటులోకి తీస్తామని ఎయిర్ టెల్ ప్రకటించింది.

రూ.49 కన్వీనియన్స్ ఫీజుతో కస్టమర్లు 10 నిమిషాల్లో సిమ్ కార్డులను వారి ఇంటి వద్దే పొందేందుకు వీలు కల్పిస్తున్నట్లు ఎయిర్ టెల్, బ్లింకిట్ తెలిపాయి. సిమ్ కార్డు డెలివరీ తర్వాత, కస్టమర్లు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ అథెంటికేషన్ ద్వారా సులభమైన యాక్టివేషన్ ప్రక్రియను ఉపయోగించి నంబర్ యాక్టివేట్ చేయవచ్చు. కస్టమర్లు పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ ప్లాన్లు ఎంచుకునే అవకాశం లేదా ఎయిర్ టెల్ నెట్ వర్క్ లోక...