భారతదేశం, ఫిబ్రవరి 24 -- ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. యాపిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మీరు కూడా ఎయిర్‌టెల్ వినియోగదారులైతే.. మీకు రెండు సేవలు అందుబాటులోకి వస్తాయి. యాపిల్‌, ఎయిర్‌టెల్ మధ్య భాగస్వామ్యంతో ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇప్పుడు యాపిల్‌ టీవీ ప్లస్, యాపిల్‌ మ్యూజిక్ సేవలను పొందగలుగుతారు. రూ.999 రూపాయల నుండి ప్రారంభమయ్యే ప్లాన్‌లలో అన్ని హోమ్ వై-ఫై కస్టమర్లు, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు యాపిల్‌ టీవీప్లస్ కంటెంట్‌ను పొందుతారని, ప్రయాణంలో ఉన్నప్పుడు వివిధ పరికరాల్లో కంటెంట్‌ను చూడటానికి వీలు కల్పిస్తుందని ఎయిర్‌టెల్ తెలిపింది.

గతేడాది ఆగస్టులోనూ ఇలాంటి ఒప్పందాన్ని ఎయిర్‌టెల్‌, ఆపిల్ కుదుర్చుకున్నాయి. అప్పుడు ఎక్స్‌ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు యాపిల్ టీవీ ప్లస్, యాపిల్ మ్యూజిక్ కంటెంట్ ...