భారతదేశం, మార్చి 11 -- Airtel, SpaceX agreement: దేశంలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించడానికి భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, మారుమూల ప్రాంతాలకు స్టార్ లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి స్పేస్ ఎక్స్, భారతి ఎయిర్ టెల్ కలిసి పనిచేస్తాయి. ఎయిర్టెల్ ప్రస్తుత నెట్ వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో స్టార్ లంక్ టెక్నాలజీని ఏకీకృతం చేసే మార్గాలను కూడా ఈ ఒప్పందం పరిశీలిస్తుంది.

స్టార్ లింక్ లైసెన్స్ దరఖాస్తు పరిశీలనలో ఉన్నప్పటికీ, స్పెక్ట్రమ్ ను వేలం వేయకుండా, నేరుగా కేటాయించాలన్న స్పేస్ఎక్స్ డిమాండ్ కు భారత ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. భారత్...