భారతదేశం, ఏప్రిల్ 10 -- Air India pilot: ఇటీవల వివాహం చేసుకున్న 28 ఏళ్ల ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పైలట్ గుండెపోటుతో మరణించాడు. 2025, ఏప్రిల్ 9, బుధవారం సాయంత్రం శ్రీనగర్-ఢిల్లీ విమానాన్ని సురక్షితంగా నడిపి ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేసిన కాసేపటికే ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పైలట్ కు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తుండగానే మరణించాడు. పైలట్ మృతిని ఎయిర్ లైన్స్ ప్రతినిధి ధృవీకరించారు. 'విలువైన సహోద్యోగిని కోల్పోయినందుకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము. ఈ విషాద సమయంలో మా ఆలోచనలు ఆ కుటుంబంతో ఉన్నాయి' అని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.

శ్రీనగర్ నుంచి ఢిల్లీకి విమానాన్ని నడుపుతున్న ఆ 30 ఏళ్ల పైలట్ ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత అస్వ...