భారతదేశం, ఏప్రిల్ 4 -- నిత్యం విమానాల్లో ప్రయాణించి, లగేజ్​ విషయంలో ఆందోళనకు గురవుతున్న వారికి ఎయిరిండియా నుంచి బిగ్​ అప్డేట్​! యాపిల్​ ఎయిర్​ట్యాగ్​ అనే టెక్నాలజీతో లగేజ్​ ట్రాకింగ్​ని మరింత సులభతరం చేసినట్టు దిగ్గజ విమానయాన సంస్థ ప్రకటించింది. ఈ టెక్నాలజీతో ఇక నుంచి ఐఫోన్, ఐప్యాడ్ లేదా మ్యాక్ పరికరాలతో ప్రయాణికులు వారి బ్యాగులను సురక్షితంగా పర్యవేక్షించుకోవచ్చు. ఫలితంగా ఆసియాలో ఈ ఫీచర్​ని అందిస్తున్న మొదటి విమానయాన సంస్థగా ఎయిరిండియా నిలిచింది. ఇది ప్రయాణికులకు అదనపు సౌలభ్యం, భద్రతను అందిస్తుందని సంస్థ చెబుతోంది.

ఈ ఎయిర్​లైన్స్ ఏటా 100 మిలియన్లకు పైగా బ్యాగేజ్​ వస్తువులను మేనేజ్​ చేస్తుంది. వీటిలో 99.6 శాతం వస్తువులు సమయానికి వచ్చేలా చూస్తుంది. అయితే, అనుకోని విమానాశ్రయ సమస్యలు లేదా తప్పిపోయిన కనెక్షన్ల కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు ఎ...