Hyderabad, ఫిబ్రవరి 26 -- వేడి పెరుగుతున్న కారణంగా ఇళ్లల్లో ఏసీ వాడకం పెరిగిపోతుంది. మండే ఎండల్లో ఏసీ రాత్రి, పగలు నిరంతరం పనిచేస్తున్నాయి. అలాంటప్పుడు విద్యుత్ బిల్లు పెరగడం సహజం. ఎందుకంటే ఎసి యూనిట్ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. కూలర్లు, ఫ్యాన్లు అంతగా ప్రభావం చూపవు. కానీ ఏసీ వాడితేనే విద్యుత్ బిల్లు పెరుగుతుంది. ఏసీ వాడినా విద్యుత్ బిల్లును ఆదా చేయడానికి లేదా తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి.

మీ ఇంటిలో లేదా ఆఫీసులో ఏసీని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి.

ఏసీ వాడేటప్పుడు సౌకర్యం, ఇంధన సామర్థ్యం మధ్య సమతుల్యత కోసం మీ ఏసీని 24-26degC కి సెట్ చేయండి. రిమోట్ లేదా మాన్యువల్ ద్వారా ఈ మార్పు చేయండి. 24 కన్నా తక్కువ ఉష్ణోగ్రత పెడితే విద్యుత్ బిల్లు పెరిగిపోతుంది.

మీ ఇంటి హాల్ లేదా గదిలో సూర్యకా...