భారతదేశం, ఫిబ్రవరి 10 -- AIIMS Trauma Care: మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ అభివృద్ధికి పూర్తి సహకారాన్ని అందిస్తామని, ఎయిమ్స్ డైరెక్ట‌ర్ కు వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ హామీ ఇచ్చారు. ఎయిమ్స్‌ ట్రామా కేర్‌ ఏర్పాటు చేసేందుకు పది ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనున్నట్టు మంత్రి తెలిపారు. న మంగళగిరి ఎయిమ్స్ డైరెక్ట‌ర్ మంత్రి సత్యకుమార్‌‌తో భేటీలో ఈ విషయం వెల్లడించారు.

మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ను దేశంలోనే అత్యున్న‌త స్థాయికి తీసుకెళ్లేందుకు కూట‌మి ప్ర‌భుత్వం పూర్తి స‌హాయ స‌హ‌కారాలందిస్తుంద‌ని నూత‌న ఎయిమ్స్ డైరెక్ట‌ర్ ఆచార్య అహంతేమ్ శాంతాసింగ్ కు వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ హామీ ఇచ్చారు.

భౌగోళికంగా మంగ‌ళ‌గిరిలోని సుంద‌ర‌మైన, ఆహ్లాదభరితమైన కొండ‌ల నడుమ ఎయిమ్స్ ను కేంద్ర‌ప్ర‌భుత్వం నెల‌కొల్పింద‌ని, 2018లో ప్రారంభ‌...