ఆంధ్రప్రదేశ్,మంగళగిరి, మార్చి 5 -- మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 69 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 33 విభాగాల్లోని సీనియ‌ర్ రెసిడెంట్‌, సీనియ‌ర్ డిమోనిస్ట్రేట‌ర్ పోస్టుల‌ను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మార్చి 15వ తేదీన ఇంటర్వూలను నిర్వహిస్తారు. ప్ర‌ధాన‌మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్ఎస్‌వై) కింద ఈ పోస్టుల‌ను మూడేళ్ల కాల ప‌రిమితితో భ‌ర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

మొత్తం 33 విభాగాల్లో 69 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. జ‌న‌ర‌ల్ కేటగిరిలో 17, ఓబీసీ 23, ఎస్‌సీ- 13, ఎస్టీ - 8, ఈడ‌బ్ల్యూఎస్ 8 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎండీ, ఎంఎస్‌, డీఎం, ఎం.సీహెచ్‌ల్లో పోస్టుగ్రాడ్యూష‌న్ మెడిక‌ల్ డిగ్రీ ఉండాలి. మెడిక‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ), నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ), స్టే...